ముగిసిన ఎమ్మెల్సీ కవిత వారణాసి ఆధ్యాత్మిక పర్యటన..

158
cm kcr family
- Advertisement -

వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యుల రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. శుక్రవారం వేకువజాము నుండి పలు దేవాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శుక్రవారం తెల్లవారుజామున ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయాన్ని దర్శించుకుని, ఆచార్య దీపక్ మాల్వియా ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాత దుందిరాజ్ ఆలయం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, గణనాథుని దర్శించుకున్నారు. ఆచార్య దీపక్ మాల్వియా, శంకర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ‘గణేష్ పూజ’లో ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామి వారికి పుష్పాభిషేకం జరిపారు. అనంతరం వరాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు.

ఆ తరువాత తులసీ ఘాట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, సీఎం సతీమణి శోభ మరియు ఇతర కుటుంబ సభ్యులు, ప్రాచీన హనుమాన్ మందిరాన్ని దర్శించుకున్నారు. చివరగా నిషర్ధన్ ఘాట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

- Advertisement -