ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం కొత్తపేట చౌరస్తాలో ఉన్న రైతు బజార్‌ను తాత్కాలికంగా ప్రజల సౌకర్యార్థం విశాల ప్రదేశమైన విక్టోరియా మెమోరియల్ హోమ్ మైదానంలో ఏర్పటు చేశారు. ఈ తాత్కాలిక రైతు బజారు ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఏర్పాటు జరుగుతున్న తీరును జిల్లా జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో , జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, సరూర్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ హరి కృష్ణయ్య మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలు ఒక చోట గుమ్మి కూడా కుండాసెల్ఫ్ డిస్టెన్స్ ద్వారా కూరగాయలు కొనుక్కొని నేరుగా ఇంటికి వెళ్లే విధంగా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ముఖ్యంగా విఎంహోమ్ అనాధ పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్‌కు సూచించారు. కరోనా మహమ్మారి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని.. ప్రజలు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని. ఇలాంటి సందర్భంలో స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు సహాయ పడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కొంత మంది పేదలకు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను మంత్రి చేతుల మీదగా ప్రజలకు అందజేశారు.
ఈ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దయాకర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బేరా బాలకిషన్, సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, మాజీ కౌన్సిలర్ దర్పల్లి అశోక్, లోకసాని కొండలరెడ్డి, రిషి, నరేష్ గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, మంచుకొండ సురేందర్ గుప్తా లతోపాటు లైన్స్ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వి ఎం హోమ్ పాఠశాల సూపరిండెంట్, వైస్ ప్రిన్సిపల్ లు పాల్గొన్నారు.