అంతర్జాతీ స్ధాయికి అనురాగ్ యూనివర్సిటీ:మంత్రి సబితా

630
palla rajeshwarreddy
- Advertisement -

ఉన్నత విద్యలో పోటీతత్వంతో విధ్యా ప్రమాణాలు పెంచి నాణ్యమైన విద్యను అందించే ముఖ్య ఉద్యేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం తెలంగాణ లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, తద్వారా 5 విధ్యా సంస్థలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి సబితా రెడ్డి.

అనురాగ్ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సబితా…. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విధ్య కొరకు విదేశాలకు పంపుతుంటారు ఈ క్రమంలో వారు పడే బాధలు అంతా ఇంతా కావని, కావున అట్టి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయికి అనురాగ్ యూనివర్సిటీ ఎదగాలని, MNC కంపెనీలలో ఉద్యోగాలు దొరికే విధంగా విధ్యా బోధన చేయాలని, మీ పై ఎంతో నమ్మకంతో, కఠినమైన ప్రమాణాలు పాటించినందుకు యూనివర్సిటీ హోదా ను తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు.

అట్టి నమ్మకాన్ని నిలబెట్టుకొని అభివృద్ధి చేయాలనీ సూచించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తమ అధికారిక సందేశాన్నిచ్చారు, దేశం యొక్క మానవ వనరుల అభివృద్ధి కోసం నాణ్యమైన విద్య ప్రముఖమైనది, ప్రపంచ స్థాయి పోటీని, సాంకేతికతను పెంచడానికి ప్రైవేట్ సంస్ధల భాగస్వామ్యం ప్రాముఖ్యమైనది, అనురాగ్ విశ్వవిద్యాలయం ఒక మంచి ఉన్నత విద్యాలయం గా ఎదిగి విధ్యా వ్యవస్థలో ఒక నూతన ఒరవడిని సృష్టించాలని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని కోరుకుంటున్నానని శుభాకాంక్షలు తెలిపారు.

కే.టీ. రామారావు వీడియో సందేశం ఇస్తూ అనురాగ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ ఉద్యోగ అవకాశాలు అధికంగా పెరిగే విధంగా విధ్యా బోధన చేయాలనీ శుభాకాంక్షలు తెలిపారు.అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో స్థాపించబడిన గాయత్రీ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1998 లో లలిత డిగ్రీ కాలేజీ, 2002 లో CVSR ఇంజనీరింగ్ కాలేజీ, 2005 లో లలితా ఫార్మసీ కాలేజీ మరియు 2010 లో ఇవన్నీ కలిపి అనురాగ్ గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ లాగ రూపాంతరం చెందిందని చెప్పారు.

ప్రస్తుతం అనురాగ్ గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ దేశ వ్యాప్త ర్యాంకింగ్స్, అక్రిడిటేషన్ లో ప్రముఖంగా NBA, NAAC, మరియు NIRF లో స్థానం సంపాదించింది అని నేడు ప్రకటించిన టైమ్స్ అఫ్ ఇండియా ర్యాంకింగ్స్ – 2020 లో, తెలంగాణ లో 5 వ ర్యాంకు, దేశ వ్యాప్తంగా 23 వ ర్యాంకు సాధించి, అనురాగ్ విద్యాసంస్థలు గత మూడు సంవత్సరాలలో 98% మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినామని తెలిపారు.

ఈ విధంగా ఇంకా మెరుగైన ప్రమాణాలకు అనుగుణంగా విధ్యా బోధనా చేస్తూ రానున్న కాలంలో సాంఘిక, వ్యవసాయ, న్యాయ, వైద్య విద్యలలో కోర్సులు ప్రవేశ పెడతామని, గౌరవ ముఖ్యమంత్రి గారు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అనురాగ్ యూనివర్సిటీ లో 14 UG, 13 PG మరియు 9 Phd ప్రోగ్రాములు నిర్వహిస్తున్నామని, అదనంగా ఇంజనీరింగ్ విభాగంలో గల కంప్యూటర్ సైన్స్ లో 5 కొత్త కోర్సులు అనగా సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులు, BBA లో డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్సు ప్రత్యేకతలతో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి హాస్టల్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ఛాన్సలర్ డాక్టర్ యూ.బి. దేశాయ్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు యూనివర్సిటీ గా రూపాంతరం చెందినందుకు మరింత బాధ్యత పెరిగిందని విద్యార్థులకు తమ ఆలోచనలకూ పదును పెట్టి మరిన్ని ప్రయోగాలు చేసుకొనుటకు ఆస్కారం ఉందంటూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉన్నవని హర్షం వ్యక్తం చేశారు, ఉప కులపతి ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ తక్కువ ఫీజులతో నాణ్యమైన ఉన్నత విధ్యను అందిస్తుందని వివిధ కోర్సుల పాఠ్యాంశం మార్కెట్ కు అనుగుణంగా ఉందని విద్యార్థి యొక్క సమూలమైన అభివృద్ధి జరిగే విధంగా ఇక్కడ వ్యవస్థ ఉందని తెలిపారు.విద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి చిత్ర రామచంద్రన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని సూచించారు.

Cyient ఎగ్జిక్యూటివ్ చైర్మన్ BVR మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల విధ్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ఇప్పుడు quarantine లో విద్య కాదని quaranteam గ విధ్యా బోధనా చేయాలనీ సూచించారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విధ్యా సంస్థ యొక్క విస్తీర్ణం ముఖ్యం కాదని బోధన ముఖ్యమని ఇక్కడ ఉన్న విద్యార్థులు మరియు బోధన సిబ్బంది నిష్పత్తి చాలా బాగా ఉందని కొనియాడారు, మార్కెట్ కి అనుగుణంగా విధ్యా ప్రమాణాలు ఎప్పటి కప్పుడు మార్పులు చేస్తూ నాణ్యమైన విద్యను అందించాలని డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశాలు ఉన్నవని చెప్పారు.

- Advertisement -