గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల..

88
etela

గాంధీ ఆసుపత్రినీ సందర్శించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.గాంధీ సమస్యలు తెలుసుకోవడానికి గాంధీ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్ లో హాస్పిటల్ హెచ్‌వోడీలతో భేటీ అయ్యారు. ఇప్పటికీ 13 మందికి ప్లాస్మా తెరపీ అందిస్తే 11 మంది బ్రతికారు అని తెలిపిన డాక్టర్స్.

గాంధీ లో చికిత్స పొందుతున్న పేషంట్ల వివరాలు ఫోన్ ద్వారా ఉదయం, సాయంత్రం పేషంట్ల బంధువులకు అందించడానికి సమన్వయ కర్తలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గాంధీ లో ప్రతి రూం కి వెంటిలేషన్ ఉండేలా చూడండి.ఎక్షాస్ట్ ఫాన్ లు ఏర్పాటు చేసి గదుల్లో ఉన్న గాలి బయటికి పంపించే ఏర్పాటు చేయాలి.శానిటైసేషన్ సిబ్బంది తక్కువ చేసి మిషనరీ ద్వారా పరిశుభ్రం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.

పేషంట్ ను వ్యక్తిగతంగా డాక్టర్స్ వెళ్లి చూడడమే కాకుండా బెడ్ దగ్గరికి వైద్య సిబ్బంది వెళ్లకుండానే ప్రతి పేషంట్ ఆరోగ్య పరిస్థితిని మోనిటర్ చేసే విధానం ను అమలు చేయాలని సూచించిన మంత్రి.ఆధునిక టెక్నాలజీ నీ వాడుకొనే ప్రయత్నం చేయాలన్నారు.

ప్రతి పేషంట్ ను బ్రతికించడానికి శక్తి వంచన లేకుండా పనిచేయండి.వ్యక్తులుగా పని చేస్తే కాదు గాంధీ లోనున్న వ్యవస్థ అంతా పనిచేయాలి. ప్రతి వార్డ్ కి ఒక HOD ను నియమించాలి. సరిగా పనిచేయని వారిని పక్కన పెట్టండి.తెలంగాణ కరోనా క్రిటికల్ కేర్ భారం అంతా గాంధీ మీదనే పడిందన్నారు. పని ఒత్తిడి పెరిగింది. 2 వేల బెడ్స్ లో వెయ్యి బెడ్స్ ఐసీయూ లోనే ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

కేసులు ఇంకా పెరుగుతాయి. దానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలి అని సూచించిన ఈటల….గాంధీ ఆసుపత్రిలో అకాడమిక్ బ్లాక్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 200 బెడ్స్ ఏర్పాటు ను పరిశీలించిన మంత్రి.గాలి వెలుతురు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.