నాణ్యమైన విద్యను అందిస్తున్నాం: సబితా

69
- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి 35 లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదులను, వసతి గృహాన్ని మంత్రి సబిత ప్రారంభించారు.

రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రవ్యాప్తంగా 400 కాలేజీలు ఉండేవని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ఎనిమిదేండ్లలో 1150 గురుకులాలను కాలేజీలుగా మార్చామని వెల్లడించారు. విదేశాలలో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ. 20 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గురుకుల్లాలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిపై ఏడాదికి లక్షా 25 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని…సీఎం కేసీఆర్ విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతులు కూడా ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -