రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట- మంత్రి సబితారెడ్డి

168
minister sabitha
- Advertisement -

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా బిబిపేటలో కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవం, నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో రైతాంగం, విద్యారంగాలపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారు. రైతు పండించిన పంటని ఇంటికి తీసుకురావడంతో పాటు విద్యార్థులు విద్య సంవత్సరం నష్టపోకుండా చూశారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన కొనసాగుతోంది అన్నారు మంత్రి.

ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే విద్యాబోధన అందుకుంటున్నారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాను. ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గం ముందుకి తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. పుట్టినందుకు తల్లిదండ్రులకు బ్రతికినందుకు బడి రుణం తీర్చుకోవాలని అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -