గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఏటూరునాగారం ఏఎస్పీ..

36
Eturnagaram ASP

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మల్కాజిగిరి డిసిపి రక్షిత కె మూర్తి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు ఏటూరునాగారం పోలీస్ కార్యాలయం ఏఎస్పీ శరత్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం విజయవంతం అయిందని, అయన దూరదృష్టితో చేపట్టిన హరితహారం యొక్క ప్రభావం భవిష్యత్ తరాలకు బంగారు కానుక అని..చక్కటి ఆక్సిజన్, మంచి వాతావరణం లభిస్తుందని అన్నారు.

హరితహారానికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతా విస్తరించి, మొక్కల పెంపకం పైన మంచి అవగాహనా కల్పిస్తున్నారు. అనతి కాలంలో మంచి ప్రజాదరణ పొందిదని కొనియాడారు. ఈ సందర్బగా ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని పి సాయి చైతన్య ఏఎస్పీ ఐపీఎస్ ములుగు, రాజేష్ చంద్ర ఏఎస్పీ ఐపీఎస్ భద్రాచలం, గౌస్ అలాం ఏఎస్పీ ఐపీఎస్ ములుగు లకు ఛాలెంజ్ చేశారు.