రాష్ట్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా పనిచేస్తానని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా నియోజకవర్గానికి రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి మంత్రి కావడం ఇదే తొలిసారి. నాకు మంత్రివర్గంలో స్ధానం లభించడం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు నాకిచ్చిన వరం అన్నారు. జిల్లా ప్రజలతో మా కుటుంబానికి ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. త్వరలోనే సీతారామ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు పనిచేస్తామన్నారు.
మంత్రిగా తప్పకుండా బాధ్యతా యుతంగా నడుచుకుంటా.నా వాహనం స్పీడ్ లిమిట్ దాటిందని చాలాన్ పడిందని రాయడం సబబు కాదు. జూలై నెలలో చలాన్ వస్తే..నేను మంత్రి ని అయ్యాక ఆ వాహనం నాకు కేటాయించారని చెప్పారు. గోదావరి పడవ ప్రమాదం లో బాధితులకు సాయం చేసేందుకు కృషి చేసా. సెల్ఫీ లు దిగారని ప్రచారం చేయడం సబబు కాదు..హెలీకాఫ్టర్ నుంచి సెల్ఫీ వీడియో నేను తీయలేదన్నారు.