డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల ప‌ట్టాలు పంపిణీ చేసిన మంత్రి‌..

28
harish

సిద్దిపేట‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు శనివారం డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల ప‌ట్టాలను అబ్ధిదారుల‌కు అందించారు. కేసీఆర్ న‌గ‌ర్‌లో ఐదో విడ‌తలో 192 మంది అబ్ధిదారుల‌కు సామూహిక గృహ ప్ర‌వేశాలు చేయించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జిల్లాలో సకల సౌకర్యాలతో ఇండ్ల‌ను నిర్మించామన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 900 మందికి డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చామ‌ని చెప్పారు. నూతన సంవత్సరంలో తాను చేస్తున్న మొదటి ప్రభుత్వ కార్యక్రమం డబుల్ బెడ్ రూం ఇండ్ల‌ ప్రారంభోత్సవమని మంత్రి తెలిపారు.

ప‌క్కా ఇండ్ల‌ను ప‌ది కాలాలు కాపాడుకోవాల్సిన బాధ్య‌త ల‌బ్ధిదారుల‌దేనని మంత్రి చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప‌రిస‌రాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని, క‌మిటీలుగా ఏర్ప‌డి కామ‌న్ ఏరియా ప‌రిశుభ్ర‌త‌, వ‌స‌తుల నిర్వ‌హణ చూసుకోవాలని సూచించారు. క‌ట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, కొత్త బ‌ట్ట‌ల‌తో గృహ‌ప్ర‌వేశాలు చేయిస్తున్నాన‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సొంత జాగా ఉన్న పేద‌ల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి హరీష్‌ తెలిపారు.