రైతులు మార్కెట్ యార్డులలో దళారుల చేతుల్లో మోసపోవద్దని సూచించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. నేడు ఖమ్మం జిల్లాలోని పలు నగరాల్లో మంత్రి ఆకస్మీక తనిఖిలు నిర్వహించారు. ఖమ్మం పత్తి మార్కెట్, రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో శ్రీ సాయిబాలాజీ జిన్నింగ్ మిల్లు, పొన్నెకల్, మేడేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం మరియు తేమ శాతం పరీక్షా కేంద్రాలను పరిశీలించారు మంత్రి పువ్వాడ అజయ్ , కలెక్టర్ కర్ణన్.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు థర కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు.
Minister Puvvada Ajay Visits Khammam District CCI Centres