- Advertisement -
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో వరదల పరిస్ధితిని నియోజకవర్గాల వారీగా సమాచారం తెలుసుకుంటున్న మంత్రి పువ్వాడ….తగిన సూచనలు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ లతో ఫోన్ లో మాట్లాడిన పువ్వాడ… తక్షణ సహాయం అందించేందుకు ఇప్పటికే అన్ని బలగాలను సిద్ధం చేశామని తెలిపారు. ప్రజారవాణా, సరుకు రవాణాకు, ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునిగాయి. రాబోయే మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
- Advertisement -