ఆందోళన చెందకండి…ప్రతి గింజ కొంటాం: పువ్వాడ

34
paddy
- Advertisement -

రైతులు ఆందోళన చెందకండి…ప్రతి గింజ కొంటామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

మంచుకొండలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో వరి పండించారని, 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశామన్నారు.జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశామని, అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -