ఓటు వేసిన మంత్రి పువ్వాడ..

235
minister puvvada
- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్‌లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలకు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. కాగా, రాష్ట్రంలోని పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఓటేశారు.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జనగామ జిల్లా బచ్చన్నపేటలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కోయిల్‌కొండలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, గ్రేటర్‌ పరిధిలో కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే వివేకానంద, కేపీహెచ్‌బీ కాలనీలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, రాజేంద్రనగర్‌లో సీఎస్ సోమేశ్ కుమార్ ఓటు వేశారు.

జడ్లర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దంపతులు, తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ దంపతులు ఓటు వేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జిల్లా ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, తాండూరులో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని 129 బూత్‌లో ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

- Advertisement -