గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

268
puvvada ajay
- Advertisement -

గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎంపీ కవిత, ఎమ్మెల్సీ బాలసాని , ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , కలెక్టర్ ఎంవీ రెడ్జి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ..గిరిజనుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషం అన్నారు. తమ ప్రభుత్వానికి రాజకీయాలు కాదు..రాష్ట్ర అభివృద్ది ముఖ్యం అన్నారు. పోడు భూములు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ది తో ఉన్నారని అన్నారు.

- Advertisement -