ప్రజలందరూ మొక్కలు నాటాలి- మంత్రి తలసాని

341
Minister Talasani Srinivas Yadav
- Advertisement -

హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ పార్క్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సుందరయ్య పార్క్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట నియోజకవర్గంలోని డీడీ కాలనీలో గల రామకృష్ణ నగర్ పార్క్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మొక్కలను నాటారు.

ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున మొక్కలను నాటి పెంచడం వలన స్వచ్చమైన వాతావరణం ఏర్పడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి తమ ఇండ్ల వద్ద, పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటాలని అన్నారు. భావితరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23 శతంగా ఉన్న అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని చెప్పారు.

పచ్చదనం పెంచడం వలన ఎలాంటి రోగాల భారిన పడకుండా ఆరోగ్యవంతంగా జీవించడమే కాకుండా సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. మొక్కల పెంపకం వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలు పూర్తి అవగాహన పెంచుకొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని అన్నారు.

- Advertisement -