కేంద్రం పీవీని విస్మరించడం బాధాకరం..

51
Minister Puvvada
- Advertisement -

భారత మాజీ ప్రధాన మంత్రి, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావును కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పీవీ జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ ఆయనకు నివాళులు అర్పించారు. ఖమ్మం నగరం మమత రోడ్ లోని లకారం ట్యాంక్ బండ్ సర్కిల్‌లో పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ పీవీ ని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు.

కిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి ముందుకు నడిపించిన పీవీకి భారత రత్న ఇవ్వాలని కోరారు. ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన పీవీని గౌరవించకపోవడం విచారకరమని అన్నారు. పీవీ శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని మంత్రి పేర్కోన్నారు.

- Advertisement -