- Advertisement -
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారభించించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 100 కేంద్రాలు ఏర్పాటు చేయగా నేడు 438 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరాలను వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. అనంతరం ప్రభుత్వం వంద శాతం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను పాలేరు జలాశయంలో 2లక్షల చేప పిల్లలను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి మంత్రి పువ్వాడ వదలడం జరిగింది.
- Advertisement -