సింధును అభినందించిన మంత్రి అజయ్..

64
pv sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ మేరకు సింధును అభినందించిన అజయ్…భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఇక ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి హైదరాబాద్‌కు చేరుకున్న సింధుకు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్,సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్,పెద్ద ఎత్తున అభిమానులు ఘనస్వాగతం పలికారు.

గత ఒలింపిక్స్‌లో రజత పతాకం సాధించిన సింధు…ఈ సారి కాంస్యం సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.