రైస్ మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు- మంత్రి

190
Minister Prashanth Reddy
- Advertisement -

ధాన్యం కొనుగొళ్లపై నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ధాన్యం సేకరించాలి. జిల్లా యంత్రాంగం అద్భుతంగా పని చేస్తోందన్నారు. 2 లక్షల 19 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 90 శాతం ధాన్యం లోడ్ అయ్యింది. మొత్తం సేకరించిన ధాన్యంలో 93 శాతం రైస్ మిల్లర్లు తీసుకోబడిందన్నారు.

హమాలి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటాం. చెని పట్టి తరుగు తీసిన ధాన్యంలో రైస్ మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, తరుగు ఎక్కువ తీసుకునే రైస్ మిల్స్ ను సీజ్ చేయాలి అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంది. సన్ ఫ్లవర్, చెనిగలు, తెల్ల జొన్నలు కేంద్రం 25 శాతమే కొనుగోలు చేస్తే మిగతా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -