భావితరాలు ఆరోగ్యంగా ఉండాలి: మంత్రి వేముల

179
vemula
- Advertisement -

వానలు వాపస్ రావాలి, భావి తరాలు ఆరోగ్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పచ్చల నడకూడలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి….చెట్లు ఉంటేనే వర్షం వస్తుందని హరితహారం కార్యక్రమం చేపట్టారని తెలిపారు.మెట్రో నగరాల్లో చెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని….వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు పచ్చని చెట్లతో పార్కుల వలే కనిపించాలన్నారు.

తెలంగాణలోని అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మితమయ్యాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఉన్నాయని చెప్పారు.గ్రామం బాగుపడేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని….ఆరేళ్ళలో తెలంగాణలో అనేక అభివృద్ధి జరిగిందన్నారు.

- Advertisement -