గ్రీన్ డేలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి వేముల

207
minister prashanth reddy
- Advertisement -

ప్రతి శుక్రవారం గ్రీన్ డే గా పాటించి మొక్కలు నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పురపాలక శాఖ మంత్రి చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని,పట్టణాలను హరిత పట్టణాలుగా తీర్చిదిద్దు కోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

పట్టణాల్లో రోడ్ల వెంట చూపరులను ఆకర్షించే ప్రత్యేక రంగుల మొక్కలు నాటాలని తెలిపారు.ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశ రక్షణలో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు ఆయనతోపాటు అమరులైన జవాన్ల త్యాగానికి సంతాపంగా నిజామాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెండు నిమిషాలు మౌనం పాటించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం వీర మరణం పొందిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.వారు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా అమరులైన సైనికుల త్యాగాన్ని స్మరించుకున్నారు.

- Advertisement -