కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది..

246
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సూచనల మేరకు కరోనా నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరు కూడా నిరాడంబరంగా ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్వయంగా రక్తదానం చేసి సమాజసేవలో గులాబీ సైనికులు ముందుండాలని పిలుపినిచ్చిన మేరకు కార్యకర్తలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు కొనసాగించాలని ఆయన సూచించారు.

ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారిని ఆదుకోవాలని తెలిపారు. బీడు భూములను కాళేశ్వరం గంగా నీళ్లతో సస్యశ్యామలం చేసి రైతే రాజు నినాదాన్ని నిజం చేసిన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడాన్ని గర్వంగా చెప్పుకుందామన్నారు.

స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన ఉద్యమ పార్టీగా,సబ్బండ వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన అధికార పార్టీగా టిఆర్ఎస్ ఎప్పుడూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని…బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్షగా నిలవాలని ఆకాంక్షించారు.

తాము చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా సామాజిక,భౌతిక దూరాన్ని పాటిస్తూ చేయాలని…పార్టీ 20 వ సంవత్సరం ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి వేముల శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -