దేశానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష..

61
- Advertisement -

దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు వేముల. త్వరలోనే కేసీఆర్‌ భారతదేశానికి నాయకత్వం వహించబోతున్నారన్నారు.

బినామీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేస్తే సీఎ కేసీఆర్ వాళ్లకు సినిమా చూపెట్టిండని తెలిపారు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే కుట్రతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని కవితమ్మను సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌కు ఇతర రాష్ట్రాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలంతా ఏకమై మద్దతు ఇందుకు ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ పథకాలు తమకు కూడా కావాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. అహంకారి నరేంద్ర మోదీ రాబోయే రోజుల్లో దిగిపోవడం ఖాయం.. దేశమంతటా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అమలవడం ఖాయమని వెల్లడించారు. అదానీ , నరేంద్ర మోదీ కి బినామీ అని ఆరోపించారు.ఆడబిడ్డ అని కూడా చూడకుండా విచారణల పేరిట వేధిస్తున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -