సచివాలయ అగ్నిప్రమాదంపై ప్రశాంత్ రెడ్డి

29
- Advertisement -

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. స్టోర్ రూంలో ఉన్న ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయన్నారు. దీంతో పొగ ఎక్కువగా వచ్చిందని.. స్టోర్ రూంలో కొంత మేర మినహా ఎక్కడా నష్టం జరగలేదన్నారు.

భవనం కుడివైపు కొద్ది సేపు మంటలు ఎగబాకాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే సచివాలయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -