భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు తథ్యం: ప్రశాంత్ రెడ్డి

133
kavitha

నిజమాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ ఖరారు అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించి, కవితమ్మని భారీ మెజారిటీ తో గెలిపించాలని తీర్మానం చేశారు. .

శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులు నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు.

స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆర్మూర్‌,బోధన్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లు, మున్సిపాల్టీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉప ఎన్నిక బరిలో టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి ఉన్నారన్నారు.