తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి. మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. వైఎస్ఆర్ తెలంగాణ పాలిట రాక్షసుడేనన్న మంత్రి.. అక్రమ ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటిని దొంగిలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంకేమనాలని ప్రశ్నించారు.
అయితే తన వ్యాఖ్యలను ఆంధ్రా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అన్నట్లుగా సృష్టిస్తున్నారని…. తన వ్యాఖ్యలు కేవలం ఆంధ్రా పాలకులను ఉద్దేశించి అన్నవేనని.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేయలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ అడ్డుపడ్డాడని.. తెలంగాణ నీటిని దొంగించాడని.. ఎన్నో అరాచకాలను చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఉద్దేశించి.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని.. ప్రజలను ఉద్దేశించి కాదన్నారు.