గ్రేటర్‌లో టీఆర్ఎస్‌దే విజయం: ప్రశాంత్ రెడ్డి

175
prashanth reddy
- Advertisement -

జిహెచ్ఎంసి పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుతో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్ల లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా పనిచేస్తామని వెల్లడించారు.

- Advertisement -