బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 70 హైలైట్స్

338
episode 70
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 70 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 70వ ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున ఇంటి సభ్యులకు ఓ బ్రదర్‌లా సలహా ఇస్తూనే చురకలంటించారు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ చివరివరకు ఎలిమినేట్ అయ్యారని చెబుతూ పెద్ద ట్వీస్ట్ ఇచ్చారు. చివరగా అఖిల్ ఇంట్లోనే ఉంటున్నారని తెలుపుతూ రిలీఫ్ ఇవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది.

తొలుత నాగార్జునకు ఇంటి సభ్యులు డ్యాన్స్‌లతో దివాళి విషెస్ తెలపగా ఇంటి సభ్యుల కోసం అమల పంపించిన గిఫ్ట్స్‌ని అందించారు నాగ్‌. తర్వాత ఇంటి సభ్యులు చేసి బిగ్ మిస్టేక్‌ని తెలుపుతూ క్లాస్ పీకారు. తెల్లవారుజామున ఒంటి గంటకు అందరినీ నిద్ర లేపిన బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఇంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో ఏకగ్రీవంగా చెప్పాలని కోరగా చాలా మంది ఎవరికి వారు స్ట్రాంగ్ అని చెప్పుకున్నారు. అలా కుదరదని డిస్కషన్ రావడంతో అందరూ అఖిల్‌ను ఏకగ్రీవంగా స్ట్రాంగ్ అని చెప్పారు. దీంతో ఆయన్ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్‌లోకి పంపారు. అయితే, ఈ విషయంలో ఇంటి సభ్యులంతా పెద్ద తప్పు చేశారని నాగార్జున అన్నారు.

బిగ్ బాస్ మూడు కండీషన్స్ ఇస్తే మీరు మాత్రం ఒక్కదానిని పట్టుకునే గేమ్ ఆడారని తెలిపారు. ఈ గేమ్‌లో మీరు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు, ఈ గేమ్‌లో మీ ఆటకు అడ్డం వచ్చేవాళ్లు ఎవరు అనుకుంటున్నారు, ఫైనల్స్‌కి మీకు అడ్డం వచ్చేవారు ఎవరు?.. అయితే, ఇంటి సభ్యులంతా మొదటి కండిషన్‌ను మాత్రమే పట్టుకుని ఎవరికి వారు స్ట్రాంగ్ అని చెప్పుకున్నారని క్లాస్ పీకారు నాగార్జున.

ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో ఆటాడుకున్నాడు నాగార్జున. బిగ్ ఫైటర్ అయిన నువ్వు అలా ఎలా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు అని అఖిల్‌ని అడిగారు నాగ్‌…స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ అలా బయటికి పంపేయరని నేను అనుకున్నాను. అంత ఈజీగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ బయటికి పంపేస్తే ఇక గేమ్ ఏముంటుంది సార్ అని తెలపగా అఖిల్‌కి షాక్ ఇచ్చాడు నాగ్.

నీ కాలిక్యులేషన్ రాంగ్…. చాలా భాషల్లో ఇలానే ప్రేక్షకులు కాకుండా హౌజ్‌మేట్స్ ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని హౌస్‌లోకి వెళ్లి వాళ్లతో సెల్ఫీ దిగి తన దగ్గరకు వచ్చేయాలని సూచించారు. దీంతో అఖిల్‌ ఏడుస్తూ తనను ఎలిమినేట్ చేయవద్దని వేడుకోగా తానే ఏమి చేయలేనని నాగ్ తెలిపాడు. దీంతో తెగబాధపడిపోయిన అఖిల్…తర్వాత హౌస్‌లోకి వెళ్లాడు. అయితే అఖిల్‌ రాకతో అంతా సంబరపడగా ట్విస్ట్‌ని కంటిన్యూ చేస్తూ అఖిల్ ఏలిమినేట్ అయ్యాడని తెలిపి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు నాగ్‌.

ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు అఖిల్‌కు టాస్క్ ఇచ్చారు నాగ్‌. ఇంటి సభ్యుల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు? నలుగురు శత్రువులు ఎవరు? చెప్పాలని అడిగారు.సొహెల్, మోనాల్‌కు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టి వాళ్లే తనకు హౌజ్‌లో నిజమైన ఫ్రెండ్స్ అని చెప్పాడు. అభిజీత్, హారిక, లాస్య, మెహబూబ్‌లను తనకు శత్రువులుగా అభివర్ణించాడు అఖిల్.

అభిజీత్‌పై అఖిల్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. అభిజీత్ తనపై వాడిన సింపథీ, ఫేక్ అనడం నచ్చలేదన్నాడు. పచ్చకామెర్లు వచ్చినోడికే మొత్తం పచ్చగా కనపడుతుందంట. అలా ఒక ఫేక్ పర్సన్‌కి కనబడుతుంది. నువ్వు ఫేక్ అయితేనే వేరే వాళ్లు నీకు ఫేక్‌లా కనిపిస్తారు అంటూ అభికి క్లాస్ పీకారు. సింపథీ కార్డ్స్ ఎప్పుడూ పనిచేయవు అని హారిక అన్న మాటను గుర్తు చేస్తూ అసలు నువ్వు నన్ను ఎప్పుడు సపోర్టు చేశావని ఇది కరెక్ట్ కాదన్నారు. ఒక

మనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరవాత అతనిపై జోక్స్ వేస్తారని అస్సలు అనుకోలేదని అన్నాడు. లాస్య నవ్వుకుంటూ జోకులు వేసేస్తుందని.. కానీ,దాని వల్ల తాను ఎంత ఫీలై ఉంటానని తెలిపాడు. ఇక మెహబూబ్ కూడా తాను అనుకున్నది జరగాలని పట్టుబడతాడని అది కరెక్ట్ కాదన్నారు.

ఇక చివర్లో ట్విస్ట్ ఇస్తూ అఖిల్ ఎలిమినేట్ కావడం లేదని తెలిపాడు.దీంతో పాటు అఖిల్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ వారం కెప్టెన్సీతో పాటు వచ్చే వారం ఇమ్యునిటీని పెంచుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో హౌస్‌లో పండగవాతావరణం నెలకొంది. ఇక ఈ వారం నామినేషన్లలో అభిజీత్, హారిక, మెహబూబ్, సోహెల్, అరియానా, మోనాల్‌లలో అభిజిత్ సేవ్‌ అయ్యారు.

- Advertisement -