ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్ఎస్‌దే- మంత్రి వేముల

156
Minister Prashant Reddy
- Advertisement -

శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సదస్సు కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి సురభి వాణి దేవి విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వాణీ దేవి పెద్ద కుటుంబం నుంచి వచ్చినా నిరాడంబరంగా ఉంటారన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అభ్య‌ర్థిగా వాణీదేవి ఎంపిక మంచి నిర్ణయం అన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ అభివృద్ది చేస్తున్నారు కనుకే ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్ఎస్ పార్టీదేన‌న్నారు.

తెలంగాణ‌లో జరుగుతున్న మంచి పనులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా జ‌రుగుతున్నాయా అని మంత్రి ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. 2016 పింఛ‌నులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవ‌లం రూ. 200 అన్నారు. అదేవిధంగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌కు కేంద్రం నుంచి వచ్చేది రూ. 76 వేలు మాత్ర‌మేన‌న్నారు. తెలంగాణ‌లో ఇచ్చిన ఉద్యోగాల క‌న్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి స‌వాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్,డీసీసీబీ వైస్ చైర్మన్ కె.వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్,జిల్లా రైతు సమన్వయ సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు కృష్ణ మోహన్,జేపి ఎన్ సీ యి ఛైర్మన్ రవి కుమార్,కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -