‘రంగమార్తాండ’.. బ్రహ్మీ న్యూ లుక్‌..

874
Brahmanandam
- Advertisement -

మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ అనే చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులు. ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ బ్రహ్మానందం ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా బ్రహ్మీ ఉన్నాడంటే అందులో నవ్వులకు కొదవ ఉండదు. కానీ రంగమార్తాండ చిత్రంలో ఆయన పాత్ర మనసులు కదిలించే విధంగా ఉంటుందని దర్శకుడు కృష్ణవంశీ చెబుతున్నాడు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం ఎంతో ఎమోషన్ పండించే పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇది కామెడీ రోల్ కాదు. రొటీన్‌గా అసలే ఉండదు. జీవితంలో ఎంతో చూసిన ఒక అనుభవజ్ఞుడిలా అతడు తెరపై కనిపించబోతున్నారని తాజాగా రివీలైన బ్రహ్మీ లుక్ చెబుతోంది. నెరిసిన తలకట్టు.. పండిన గడ్డం.. పెద్ద కళ్ల జోడు.. ఈ గెటప్ చూస్తుంటే కొంత వరకూ ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ ని జ్ఞప్తికి తెస్తోంది.

ఇక ఆ స్థాయి అనుభవాలు ఘడించిన ఓ సీనియర్ సిటిజన్ పాత్రలోనే బ్రహ్మీ నటించబోతున్నారని అర్థమవుతోంది. అలా ఆ గడ్డంపై చేతిని ఆన్చి దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారో కానీ.. ఈసారి కంటతడి పట్టించే ఎమోషన్ ఖాయమేనని ఫ్యాన్స్ కు అర్థమవుతోంది. ప్రస్తుతం బ్రహ్మీ కొత్త గెటప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Based on a popular Marathi drama, Natsamrat, director Krishna Vamsi has passionately designed his next film with Prakash Raj and Ramya Krishnan..

- Advertisement -