- Advertisement -
దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మిగిలిన వారి కోసం ఈ నెల 28 వరకు గడువు ఇచ్చామని తెలిపారు. ఇది రీ సర్వే కాదు.. కొంత మంది తమ సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నెల 28 వరకు మరోసారి గడువు ఇచ్చాం అన్నారు పొన్నం.
స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాం అన్నారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనకుండా కొంతమంది విమర్శలు చేస్తున్నారని అన్నారు.
Also Read:వృక్షార్చన..మొక్కలు నాటిన కడియం నర్సరీ రైతులు
- Advertisement -