- Advertisement -
ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు నేడు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. గల్ఫ్‌కి వెళ్ళిన కార్మికులు చెయ్యని తప్పులకు ఇబ్బంది పడుతున్నారు అని…గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అని వెల్లడించారు.
గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో 5 శాతం సీట్లు కేటాయిస్తాం అని తెలిపిన పొన్నం..హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్‌మేళా నిర్వహిస్తే 9 వేల మంది వచ్చారు అన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా కార్మికులను గల్ఫ్‌కు తీసుకువెళ్ళే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం అని తేల్చి చెప్పారు పొన్నం.
Also Read:కలబందతో మొటిమలకు చెక్!
- Advertisement -