జూబ్లీహిల్స్‌లో ప్రచార జోరు

6
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్, వెంగళరావు నగర్ ఇక్రిశాట్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సంజయ్ గౌడ్ సహా ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు.

Also Read:శ్రీ విష్ణుతో నయన్ సారిక

- Advertisement -