సాగునీటితో పెరిగిన పంటలసాగు: నిరంజన్‌ రెడ్డి

175
niranjan reddy
- Advertisement -

సాగునీటి రాకతో ఈ ప్రాంతంలో పంటల సాగు పెరిగిందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌ రెడ్డి…నేను మీ ప్రతినిధిని…మీరు నాకిచ్చిన అవకాశంతో మీకోసం పనిచేస్తున్నా అన్నారు.

మీలో నన్ను చూసుకుంటున్నా .. నన్ను మీ స్నేహితుడుగా భావించి పనితీసుకోండి… పనిచేసే వారికి ప్రజల ఆశీస్సులుంటాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక మార్కెట్ వనపర్తి…. వేరుశనగ దిగుబడిలో మన ప్రాంతం దేశంలోనే రికార్డ్ , భవిష్యత్ లో మరింత పెరుగుతుందన్నారు.సాగునీటి రాకతో ఈ ప్రాంతంలో పంటలసాగు పెరిగింది… పనిచేయాలన్న తపన ఉంటే మనసుపెట్టి పనిచేస్తాం .. దానికి ప్రజల ఆశీస్సులు నిరంతరం ఉంటాయన్నారు. వ్యవసాయ పనులు పెరగడంతో కూలీల కొరత పెరిగిపోయింది..ప్రజలకు ఎంత బతుకుదెరువు లభించిందన్నది ముఖ్యం…. ప్రజల కోసం పనిచేశాం వారికి ఉపాధి కల్పించిన ఆనందం ఉందన్నారు.

నియోజకవర్గంలో మిగిలిన అన్ని గ్రామాలు, తండాలకు నీళ్లిస్తాం….తెలంగాణ వచ్చే నాటికి పెబ్బేరు మండలంలో కొంత ప్రాంతం మినహా ఏ మండలానికి సాగునీరు లేదన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఊరికి నీరందచేసే ప్రయత్నంలో ఉన్నాం….ఇప్పటివరకు నియోజకవర్గంలో 54 మినీలిఫ్టులు ఏర్పాటు చేసి నీరందిస్తున్నాం అన్నారు.

రాబోయే రోజులలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో యువతకు భారీగా ఉపాధి లభించనుందని… రైతువేదికల నిర్మాణంతో రైతులకు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల మెళకువలు నేరుగా అందుబాటులోకి రానున్నాయన్నారు.

- Advertisement -