పప్పుధాన్యాలకు ప్రాధాన్యత పెరగాలి: నిరంజన్‌ రెడ్డి

111
niranjan reddy

మాంసాహారం తర్వాత అత్యధిక ప్రొటీన్లు ఉండేది పప్పుధాన్యాలల్లోనే అని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రపంచంలో అత్యధికంగా పప్పుధాన్యాలు పండేది మన దేశంలోనే ప్రతి ఏటా 20 నుంచి 22 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ‘వరల్డ్ పల్సెస్ డే’ గోడపత్రికను ఆవిష్కరించారు.

పప్పుధాన్యాలకు ప్రాధాన్యత పెరగాలని ….వరి కన్నా మూడింతలు, గోధమకన్నా రెండింతలు ప్రొటీన్లు ఎక్కువుంటాయని వెల్లడించారు నిరంజన్ రెడ్డి. పప్పు ధాన్యాల ప్రాధాన్యతపై ఈ నెల 10న వరల్డ్ పల్సెస్ డే నిర్వహించనున్న సందర్భంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్ & ఇండస్ట్రీ సంస్థకు, ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

దేశ అవసరాల నిమిత్తం రెండు నుంచి మూడు మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. ఈ ఏడాది తెలంగాణలో 10.8 లక్షల ఎకరాలలో కంది సాగును ప్రోత్సహించారని తెలిపారు. రైతులు కందితో పాటు పప్పుశనగ, పెసర, మినుము తదితర పంటలు మరింతగా సాగుచేసి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలని సూచించారు.