కేంద్రమంత్రికి లేఖ రాసిన మంత్రి నిరంజన్ రెడ్డి

256
niranjanreddy
- Advertisement -

కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మణుగూర్, జహీరాబాద్, అక్కన్నపేట(మెదక్), బాసర, నల్లగొండ, బిబి నగర్, మహబూబాబాద్, ఉప్పల్(కరీంనగర్), కొత్తగూడెం, మదనాపురం- వనపర్తి రోడ్, వికారాబాద్ లో కొత్త రేక్ పాయింట్లు పునరుద్దరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.

ప్రస్తుతం ఉన్న రేక్ పాయింట్ల నుండి వర్షాలు పడి ఎరువుల డిమాండ్ ఉన్నప్పుడు రైతులకు ఎరువులు సరఫరా చేయడం ఇబ్బంది అవుతుందని, కొత్త రేక్ పాయింట్లు ఏర్పాటుతో రవాణా ఛార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. రాబోయే రోజులలో సాగుచేసే భూమి విస్తీర్ణం మరింత పెరుగుతుంది.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వెంటనే రేక్ పాయింట్లకు అనుమతి ఇవ్వాలని తెలిపారు.

niranjan Reddy Letter

- Advertisement -