రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. – కరోనా అప్రమత్తతలో జాతీయ సగటును మించి ఉన్నది తెలంగాణ రాష్ట్రమేనని….కరోనా పరీక్షలు, టీకాలు, ఇతర అన్ని విషయాలలో తెలంగాణనే ఆధిక్యంలో ఉందన్నారు. సంధర్భం కాకపోయినా, ప్రస్తావించాల్సిన అవసరం లేకున్నా బీజేపీ పాలిత రాష్ట్రాలు మనకు వెనకబడే ఉన్నాయన్నారు.
మన రాష్ట్రంలో అందరికీ టీకా ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం అద్భుతం అని…. కరోనా వాక్సినేషన్ ను మనమందరం ఒక యుద్ధంగా భావించి చేయించాలన్నారు. కఠినంగా వ్యవహరించి అయినా ప్రజలను అప్రమత్తం చేసి టీకాలు వేయించాలి….. గ్రామాలలో స్థానికంగా సామూహిక పండుగలు వద్దని చాటిచెప్పాలన్నారు. వాటిని అరికట్టకుంటే మనమందరం నష్టపోతాం …. దీనిని అరికట్ట కలిగితేనే మనం వేగంగా అభివృద్దిలో ముందుకు వెళ్లగలుగుతాం అన్నారు.
కుటుంబ శుభకార్యాలన్నీ పరిమితంగా చేసుకోవాలి…. ఏదయినా ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులే బాధ్యత వహించాలన్నారు. వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి , ఎంపీపీలు, జడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు,ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు నిరంజన్ రెడ్డి.