చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌..

594
Minister Niranjan Reddy Speech
- Advertisement -

ఈ రోజు మాదాపూర్ హైటెక్స్ లో అగ్రి టెక్స్ 7వ ఎడిషన్ 2019ను వ్యవసాయ శాఖామంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాల్టి నుండి మూడు రోజుల పాటు ఈ అగ్రిటెక్స్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఇక్కడ అధునాతన వ్యావసాయ అన్వేషణ ,పాడి ,పుడ్ ప్రాసెసింగ్ ,ఆక్వా కల్చర్ ,హార్టికల్చర్ ,విజ్ఞాన సదస్సు లపై సమాచార సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో పాటించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సందర్శన రూపంలో పెట్టడం రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.

30 నుండి 40 సంవత్సరాల కింద వ్యవసాయరంగంలో అనుసరించే విధానాలు ఇప్పుడు లేవు.ఇప్పుడున్న విధానాలు మరో 10 సంవత్సరాల్లో మార్పు రావొచ్చని మంత్రి అన్నారు.గొడ్డు చాకిరి కి ఫుల్స్టాప్ పెట్టి.. సాంకేతికతను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం అనేది ఒక నాగరిక జీవన విధానం.రైతులు ఆత్మ విశ్వసంతో వ్యవసాయం చేసేవిదంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అన్ని వృత్తులను బలోపేతం చేస్తున్నాం.మంచి నీళ్లల్లో చేపల పెంపకం చేస్తున్నాం. చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది.రాష్ట్రంలో పాల, కూరగాయల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. యాంత్రీకరణ సామగ్రిని దశల వారీగా రైతులకు అందిస్తున్నాం.యూరియా విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.

Minister Niranjan Reddy

సోషల్ మీడియాలో వస్తున్న వార్త అబద్ధం నేను దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో మాట్లాడాను. అక్కడ యూరియా లారీలు ఉన్నాయి psa సెంటర్ దగ్గర యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతులు యూరియా కోసం లైన్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఒక రైతుకు గుండెపోటు రావడం జరిగింది. ఇది యూరియా కోసం కాదు అది యాదృచ్చికంగా జరిగిందని..కొంతమంది దాన్ని ఉదేశ్య పూర్వకంగా చేస్తున్నార మంత్రి వివరించారు.

రాష్ట్రంలో కొంతమంది ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రభుత్వం మీద వాళ్లకు ఉండే వ్యతిరేకతను వెళ్ల కక్కుతున్నారు. ఇటువంటి వాటిని సాకుగా వాడుకుంటున్నారు..రైతాంగానికి హృదయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న ఉదయం నిద్ర లేచినప్పటినుండి ఏ జిల్లాకు ఎంత స్టాక్ అవసరం ఇంకా ఎంత డిమాండ్ ఉంది అని మినట్ టు మినట్ మానిటర్ చేస్తున్నాము. అధికారులు మానిటర్ చేసున్నారు.. రైతులు నిశ్చింతగా ఉండానిలన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో వరదల కారణంగా ఒకసారి ,మనకు రావాల్సిన యూరియా కేంద్రం కర్ణాటకకు పంపడం వలన మరోసారి కొంత సమయం ఆలస్యం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదు.కొంత మంది ఉద్దేశ పూర్వకంగా నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్ మీద మా ప్రభుత్వం మీద కావాలని బదునామ్ చేస్తున్నారు.

అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ డా ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. ఇలాంటి ఎగ్జిబిషన్ ల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.వ్యవసాయంలో ముందుకెళ్లాలంటే తక్కువ మోతాదులో మందులు వాడాలి.సేంద్రీయ ఎరువులను ఎక్కువ వాడాలి. అప్పుడే అధిక దిగుబడికి ఆస్కారం ఉంటదని ఆయన అన్నారు.కూలీల కొరతను అధిగమించేందుకు కొత్త టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది.మనకున్న వనరులను బట్టి పంటలను పండించాలి.వ్యవసాయరంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీని రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యవసాయాన్నీ బిజినెస్ రూపంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని డా ప్రవీణ్‌ రావు తెలిపారు.

- Advertisement -