తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఎ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్ష్యతన జరిగిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తొమ్మిదేళ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందన్నారు. హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటుందని…ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులతో తెలంగాణకు వరస కడుతున్నాయన్నారు. 24 గంటల కరంటు, సాగునీరు, తాగునీరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనతో ముందడుగు వేస్తుందన్నారు.
Also Read:సోంపు వాటర్…ఉపయోగాలు
రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరంటు, అందుబాటులో విత్తనాలు, ఎరువులతో తెలంగాణ సాగు దశమారిందని..విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాలలో తెలంగాణ వేగంగా విస్తరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఇస్తున్న అవార్డులే దీనికి నిదర్శనం అపి…ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలన్నారు. హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఆశీస్సులు అందించారు వేద పండితులు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానుగంటి, టోని జాను, మోహిత్ కర్పూరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు అనిల్ బందారం, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి కంచర్ల, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షురాలు మహాతి రెడ్డి, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, భానుప్రసాద్ ధూళిపాల, శేఖరం కొత్త, హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు సాయి వర్మ, సీతారాం రెడ్డి భవనం, శ్రీకాంత్ జలగం, అశోక్ వర్దనం, నరేందర్ మెతుకు, సుధాకర్, సత్య, ఉదయ్, వెంకట్ ఎంకా, నాగరాజు రెడ్డి నల్లా, అరవింద్ తక్కళ్లపల్లి, రజనీకాంత్ కొసనం తదితరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.