కాంగ్రెస్ పాలనలో అన్ని పెండింగే..

19
- Advertisement -

జడ్చర్ల బహిరంగసభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో అన్నీ పెండింగే..నీళ్లు పెండింగ్..నిధులు పెండింగ్ అని మండిపడ్డారు. కరంటు పెండింగ్…ఫించన్ పెండింగ్..పాలన పెండింగ్..ప్రజల సమస్యలు పెండింగ్ అన్నారు.పెండింగ్ కు పర్యాయపదం కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.

నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ మొఖం పెట్టుకుని పాలమూరు ప్రజలను ఓట్లు అడుగుతారన్నారు. అధికారం ఎప్పుడు దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారు .. కానీ 5 దశాబ్దాల అధికారంతోనే కదా అధోగతి పట్టించిందన్నారు.

Also Read:‘ఏకపాద విపరీత దండాసనం’ ఉపయోగాలు!

పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన చూసి 2018లో ఉమ్మడి పాలమూరులో 14కు 13 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టారని..ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పాలకుల సామర్ద్యానికి గీటురాయి అన్నారు. ఐదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో స్థానం లేదు .. వారి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ పండవన్నారు. కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్ నేతలు పగటికలలు కంటున్నారని..అక్కడ ప్రత్యామ్నాయం లేక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారన్నారు. అక్కడ అధికారం రాగానే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఆశలు మొదలయ్యాయి…పార్టీలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించే పవర్ కోసమే వారి పాదయాత్రలు అన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సాగునీరే కాదు తాగునీటికీ ఇబ్బందులే…పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం అన్నారు. అధికారం మీద కాంగ్రెస్ దింపుడుకళ్లెం ఆశతో ఉందని…ఈ సారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాదిరే అవుతుందన్నారు.

Also Read:‘మళ్ళీ పెళ్లి’ ఆటంబాంబ్ లా పేలుతుంది

- Advertisement -