అధికారం కోసం అబద్దాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. మూసాపేట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు నిరంజన్ రెడ్డి. వందేళ్ల అబద్దాలు బీజేపీ అప్పుడే చెప్పేసిందన్నారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ రైతులతో సమావేశం నిర్వహించి కేంద్రం రైతుల పంటలు కొనడం లేదని, తాము అధికారంలోకి వస్తే రైతులు పండించిన అన్ని పంటలు కొంటామని చెప్పారు…కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రణాళికాబద్ధంగా అబ్బదాలతో ప్రజలను నమ్మించారన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోడీ చెప్పిన మాటల ఆధారాలను మంత్రులు, ఎంపీల బృందం చూపితే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మొహంలొ నెత్తురు చుక్క లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా దేశంలోని రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…గుజరాత్ లో లేని పెన్షన్లు తెలంగాణలో కేసీఆర్ ఇస్తున్నారన్నారు.
ఎకరాకు రూ.10 వేల చొప్పున కోటి 50 లక్షల ఎకరాలకు కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నారు…..గుజరాత్ లో సాధ్యం కాని వ్యవసాయానికి 24 గంటల కరంటు తెలంగాణలో కేసీఆర్ రైతులకు ఇస్తున్నారన్నారు. మాకు సాధ్యం కానిది కేసీఆర్ చేస్తున్నారన్న అసూయ, ద్వేషం కేంద్రానిది అన్నారు. చైనా దేశం… ప్రతీ వస్తువులు తయారు చేసి ప్రపంచంలోని అన్ని దేశాలను తమ వైపు తిప్పుకుందని….రష్యా దేశం సైతం చమురు ఉత్పాత్తులు తమ గుప్పెట్లో పెట్టుకుందన్నారు.

