భవిష్యత్ తరాల బాగు కోసమే హరితహారం..

228
Minister Niranjan Reddy
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మొక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అనంతరం కొల్లాపూర్,ఎల్లూరులలో రైతు వేదిక భవన నిర్మాణాలకు,సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి,ఎస్సీ కమ్యూనిటీ హాల్ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..భవిష్యత్ తరాల బాగు కోసమే హరితహారం. ఆరో విడత హరితహారంలో ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వం పెంచింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం రాష్ట్రంలో అద్భుత ఫలితాలనిస్తుందని మంత్రి అన్నారు.మొక్కలు నాటి వృక్షాలుగా తయారు చేస్తేనే జీవ ప్రాణకోటి మనుగడకు ప్రమాదం ఉండదన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్న రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ దే. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చెప్పినట్లుగా రాష్ట్రంలోని రైతులు నియంత్రిత సాగు వ్యవసాయం చేస్తుండడం శుభపరిణామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -