కోహెడ బాధితులకు అండగా ప్రభుత్వం: నిరంజన్ రెడ్డి

246
niranjan reddy
- Advertisement -

కోహెడ మార్కెట్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వం అన్నారు.

మార్కెట్ కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కల్పించడం జరిగిందని… కోహెడ మార్కెట్ దుర్ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు. చికిత్స అనంతరం 12 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జి, 18 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.

గాయపడిన వారిని సమీప అమ్మ, సన్ రైస్, షాడో, టైటాన్ ఆసుపత్రులకు తరలించామని.. సీరియస్ ఉన్న ఒకరిని కామినేని ఆసుపత్రికి తరలించామన్నారు. నాలుగు ఆసుపత్రులలో పర్యవేక్షణకు నలుగురు అధికారులను నియమించామని చెప్పారు.

కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందని వాతావరణ శాఖ నివేదించిందని… దుర్ఘటనకు సంభంధించి రాజకీయాలు పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. మార్కెట్ పునరుద్దరించే వరకు కొనుగోళ్లకోసం రైతులకు, ట్రేడర్లకు ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం అన్నారు.

- Advertisement -