కరోనా వ్యాధి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన సహాయక చర్యలకు తీసుకుంటుంది. ఈనేపథ్యంలో పలువురు ప్రముఖులు కరోనా కట్టడికి సహాయక చర్యల్లో భాగంగా తమ వంతు సాయంగా చేస్తున్నారు. తాజాగా మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులు రమేష్ కుమార్ బంగా, పురుషోత్తం దాస్ మందానా, ఉమేష్ చంద్ అసావా లు మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.
విపత్తు సమయంలో తోడ్పాటునివ్వండి..నియంత్రణే కరోనా నివారణకు ఏకైక మార్గం అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యాధి లక్షణాలు ఉన్నవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని.. విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు వివరాలు తెలిపి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అంతేకాదు కరోనా ఉన్నట్లు ఎవరి వివరాలు అయినా తెలిస్తే ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఆపత్కాలంలో మీ తోడ్పాటు అన్నార్ధులకు అండ అవుతుందని మంత్రి తెలిపారు.