ఏ రంగమైనా మహిళల పాత్ర కీలకం- మంత్రి నిరంజన్ రెడ్డి

181
- Advertisement -

ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన శాసనసభలోని తన ఛాంబర్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్ గార్లకు  ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి,  కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సృష్టికి మూలం అమ్మ.. ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానం ఉంది. వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్చ మరింత పెరగాలి అన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆడబిడ్డలకు అంతగౌరవం లభించడం లేదు…ఈ పరిస్థితిలో మరింత మార్పు రావాలి అన్నారు. వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకం.. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయి. మహిళ నాయకత్వం వహించే ఏ రంగమైనా ఖచ్చితంగా ఉన్నతస్థానంలో ఉంటుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి కొనియాడారు.

- Advertisement -