సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులను చైతన్యం చేయాలి:నిరంజన్ రెడ్డి

234
niranjan reddy
- Advertisement -

హైదరాబాద్ టూరిస్ట్ ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ తెలంగాణ సిరి సిటీ కంపోస్ట్ సేంద్రీయ ఎరువులను మార్కెట్లోకి విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి , అగ్రోస్ ఎండీ రాములు హాజరయ్యారు.

సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులను చైతన్యం చేయాలని…. తెలంగాణ సిరి సేంద్రీయ ఎరువులను రైతులు ఆదరించాలన్నారు నిరంజన్ రెడ్డి. తెలంగాణలోని 600 అగ్రోస్ కేంద్రాలలో లభిస్తుంది….. పంటల అధిక ఉత్పత్తి పేరుతో రైతులకు రసాయనిక ఎరువులను అలవాటు చేశారని తెలిపారు. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని విస్మరించారు….గత ఏడాది 8.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా వాడారు, ఈ ఏడాది 10.5 లక్షల మెట్రిక్ టన్నులు సరిపోయేలా లేదు అన్నారు.

రైతులకు పొలాలకు ఎరువుల వాడకంపై మరింత అవగాహన కల్పించాలి…దీనిపై రైతులను చైతన్యం చేయడంపై దృష్టి సారిస్తున్నాం అన్నారు. జిల్లాల వారీగా కార్యక్రమాలు పెట్టి సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన పెంచాలి…. తెలంగాణలో ఈ ఏడాది దాదాపు 12 లక్షల ఎకరాలలో పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి సాగుచేయించాం అన్నారు. ఇక ఏడాదికి రెండుసార్లు భూసార పరీక్షలు .. రైతుల పొలాలకు సాయిల్ హెల్త్ కార్డులు…. అధిక ఎరువుల మూలంగా కూరగాయలు, పండ్లతోటలు, పంటలన్నీ విషతుల్యమవుతున్నాయని చెప్పారు.

జర్మనీలో సర్కారు సూచన మేరకు ఎరువులు వాడిన రైతులకు ఏడాదికి 2500 యూరోలు నజరానా ఇస్తుంది .. మోతాదు మించితే పది రెట్ల జరిమానా వసూలు చేస్తుందన్నారు. అధిక ఎరువులు పంటకు, భూమికి రెండిండింటికీ చేటు…. దీనిమూలంగా విదేశీ ఎగుమతులకు అనుమతి లభించడం లేదు లండన్ కు మామిడిపండ్లు ఎగుమతి చేసిన తొలిరైతును నేను…..- కరోనా మూలంగా ఈ ఏడాది ఎగుమతి చేయలేకపోయాను అని చెప్పారు.

ఆదాయం వస్తే రైతుకు వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుంది .. నాణ్యమైన పంటలతోనే అది సాధ్యం…వాతావరణ పరిస్థితుల వల్ల పంటల సాగుకు విస్తృత అవకాశం మన తెలంగాణకు ఉంది..చెత్త నుండి ఇప్పుడు కరంటు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం జరుగుతుందన్నారు. భావితరాల ఆరోగ్యంపట్ల తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తుంది…..గ్రామాలు, పట్టణాలలో పల్లె, పట్టణ ప్రగతితో ప్రణాళికాబద్దంగా డంపింగ్ యార్డులు పెట్టి తడి, పొడి చెత్త వేరు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి….ఈ దేశ వాతావరణ పరిస్థితులు మనను వివిధ వ్యాధులు, రోగాల నుండి కాపాడుతున్నాయితెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ తెలంగాణ సిరి సిటీ కంపోస్ట్ సేంద్రీయ ఎరువులను మార్కెట్లోకి విడుదల చేశారు.

- Advertisement -