ఉద్యానసాగులో తెలంగాణ టాప్..

131
Minister Niranjan reddy
- Advertisement -

ఉద్యానసాగు సగటులో తెలంగాణ టాప్‌ పొజిషన్‌లో నిలిచిందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేంద్రప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. మామిడి విస్తీర్ణంలో 3.21 లక్షల ఎకరాలతో 8వ స్థానం .. ఉత్పత్తిలో దేశంలో నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. మామిడి ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 8.17 మెట్రిక్ టన్నులు .. తెలంగాణ సగటు 9.24 మెట్రిక్ టన్నులు అని తెలిపారు.

మిరపసాగులో 3.88 లక్షల ఎకరాలతో 6.51 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఉత్పాదకతలో మిరప జాతీయ సగటు 3.77 మెట్రిక్ టన్నులు .. తెలంగాణ సగటు 5.67 మెట్రిక్ టన్నులు అన్నారు. 86 వేల ఎకరాలలో పసుపుసాగుతో దేశంలో రెండో స్థానం .. 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 5వ స్థానంలో నిలిచిందన్నారు.

కూరగాయల ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 18.79 మెట్రిక్ టన్నులు .. తెలంగాణ సగటు 24.77 మెట్రిక్ టన్నులు అన్నారు. ఆయిల్ పామ్ సాగులో 20 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా ఈ ఏడాది చివరి వరకు విస్తీర్ణంలో అగ్రస్థానానికి చేరుకోనుంది తెలంగాణ. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఇప్పటికే 3.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంలో ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, ఉచిత కరంటు, సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహంతో అద్భుతాలు సాధిస్తుందన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ప్రకారం వైవిధ్యమైన పంటల సాగుతో మరిన్ని సాధించే అవకాశం ఉందన్నారు. ప్రజల పోషకభద్రత పెంచడానికి ఉద్యానసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని .. పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేశారన్నారు. 60 ఏండ్లు పైబడిన రైతులకు ఫించన్ ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారన్నారు.

ఇవికూడా చదవండి..

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

దమ్ముంటే మళ్లీ గెలవండి…కేటీఆర్ సవాల్

అక్కడ వానలు…ఇక్కడ చలి

- Advertisement -