బీఆర్ఎస్‌ గెలిస్తే..పోలవరం పూర్తి

18
- Advertisement -

ఏపీలో బీఆర్ఎస్ గెలిస్తే పోలవరం ప్రాజెక్టు చేస్తామని చెప్పారు మంత్రి మల్లారెడ్డి. ఏపీలోనూ బీఆర్ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మల్లారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి…కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని, త్వరలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.

ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణలో కాళేశ్వరం తరహాలో ఏపీలోనూ పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు ఏపీకి చెందిన పలువురు నేతలు. ఏపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -