ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి మల్లారెడ్డి..

577
Minister Malla Reddy participated in cleanliness drive
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయము 10: 00 గంటలకు పది నిమిషాలు మీకోసం కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి వారి సతీమణి కల్పన రెడ్డిలు వారి స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ.. డెంగ్యూ,చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు మరియు అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పదినిమిషాల పాటు విధిగా మన ఇంట్లో మరియు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజలకు పిలుపునిచ్చారు. కావున ప్రతి పౌరుడు ఈరోజు నుండే ప్రతి ఆదివారం ఉదయము10 గంటలకు పదినిమిషాల పాటు విధిగా మీ ఇంట్లో మరియు ఇంటి పరిసరాలలో నిలిచి ఉన్న నీటిని తొలగించి వ్యాధులు వ్యాపించకుండా చూడాలని మంత్రి తెలిపారు.

Minister Malla Reddy participated in cleanliness drive

ఎయిర్ కూలర్‌లో ఉన్న నిలువ నీటిని తొలగించి ఫ్రెష్ నీటిని పోసుకోవాలి. రిఫ్రిజిరేటర్ యొక్క డ్రాప్ పాన్ తీసి అందులో లో ఉన్న నీటిని కాళీ చేయాలి.ఇంటి ముందు కానీ వెనుక గాని పగిలిన కుండలు, డబ్బాలు, డ్రమ్ములు మొదలగు వాటిలో నీరు నిలిచి ఉంటే తొలగించాలి. పరిసరాల్లోని పిచ్చిమొక్కలను, గుబురుగా పెరిగిన ఇంటి ఆవరణలోని మొక్కలను కత్తిరించాలి.ఇంటికి సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంకులు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఈరోజు నుండే ఈ ఉద్యమాన్ని ప్రారంభిద్దాం..ప్రతి ఆదివారం నిలువ నీటిని తొలగిద్దాం. వ్యాధులకు కారణం అయ్యే దోమలను పారదోలుదాము. ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన గ్రామాలను పట్టణాలను ఆరోగ్యవంతమైన,పరిశుభ్రమైనవి మలుచుకునేందుకు మరియు ప్రజలందరూ ఇళ్లకు పరిమితమై కరోణ మహమ్మారిని అరికట్టేందుకు సహకరించాలని మంత్రి మల్లారెడ్డి కోరారు.

- Advertisement -