దమ్ముంటే రాజీనామా చేయి..రేవంత్‌కు మంత్రి సవాల్

103
mallareddy

రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి…తెలంగాణ లో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా అన్నారు.

కాంగ్రేస్ పార్టీ దివాళా తీసిన పార్టీ అని మండిపడ్డ మల్లారెడ్డిఇ……గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రేస్ చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్ చెప్పాలన్నారు.రేవంత్ రెడ్డి మూఢుచింతల పల్లి సభ పెట్టినందుకు దళితులు తిడుతున్నారు……రేవంత్ రెడ్డి ఖబడ్ధార్ ఇక రేపటి నుంచి చూసుకుంటా అని హెచ్చరించారు.మల్లారెడ్డి భూములను జేబులో పెట్టుకోని తిరుగుతలెను- కంప్యూటర్ లో చూస్తే అసైన్డ్ ల్యాండా? కాదా అని తెలుస్తది కావాలంటే రేవంత్ చూసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా తొడగొట్టి రేవంత్‌కు సవాల్ విసిరిన మల్లారెడ్డి..ఇద్దరం రాజీనామా చేద్దాం…రేవంత్ మళ్లీ ఎంపీగా గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మూడు చింతలపల్లి లో 62కోట్ల రూపాయల తో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశాం……మూడు చింతల పల్లి అనే కొత్త మండలం ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం అన్నారు. మూడు చింతలపల్లి లో ఉన్న అభివృద్ధి కొడంగల్ లో ఉందా? అని ప్రశ్నించారు.